ఎగుమతుల్లో జోరు

Tue,April 16, 2019 12:40 AM

11 percent growth in March

-మార్చిలో 11 శాతం వృద్ధి
-దిగుమతుల్లో 1 శాతానికి పరిమితం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశీయ ఎగుమతులు మళ్లీ దూసుకుపోయాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగడంతో ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. మార్చి నెలకు గాను ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి 32.55 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫార్మా, కెమికల్స్, ఇంజినీరింగ్ విభాగాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడం ఎగుమతులు పుంజుకోవడానికి దోహదం చేశాయి. ఇదే సమయంలో దిగుమతులు 1.44 శాతం తగ్గి 43.44 బిలయన్ డాలర్లకు పడిపోయాయి. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 10.89 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 13.51 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా తగ్గింది. మార్చి నెలలో భారత్ 3.27 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నది. గతేడాది చేసుకున్నదాంతో పోలిస్తే 31.22 శాతం అధికం. ఇదే సమయంలో చమురు దిగుమతి 5.55 శాతం పెరిగి 11.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే ఎగుమతులు 9 శాతం ఎగబాకి 331 బిలియన్ డాలర్లుకు చేరుకోగా, దిగుమతులు 8.99 శాతం పెరిగి 507.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది వాణిజ్యలోటు 176.42 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 2017-18లో నమోదైన 162 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా పెరిగింది.

640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles