మార్చిలో 11.38 లక్షల ఉద్యోగాలు

Sat,May 25, 2019 12:12 AM

1138 lakh jobs in March

-ఈఎస్‌ఐసీ డాటా వెల్లడి
న్యూఢిల్లీ, మే 24: భారత్‌లో ఉద్యోగ అవకాశాలు జోరందుకుంటున్నాయి. మార్చి నెలలోనూ సంఘటిత రంగంలో 11.38 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఫిబ్రవరిలోనూ కూడా 11.02 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.48 కోట్ల మందికి ఉపాధి లభించినట్లు అయిందని తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయో వివరాలు మాత్రం ఈఎస్‌ఐసీ వద్ద లేదు. కానీ, సెప్టెంబర్ 2017 నుంచి మార్చి 2018 వరకు 88.30 లక్షల మంది నికరంగా నమోదు చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రతినెల గణాంకాలను ఈఎస్‌ఐసీ విడుదల చేస్తున్నది.

2266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles