20 శాతం పెరిగిన నగదు డిమాండ్

Sat,November 9, 2019 02:19 AM

న్యూఢిల్లీ, నవంబర్ 8: పెద్ద నోట్లను రద్దుచేసినప్పటికి కరెన్సీకి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో రూ.21.59 లక్షల కోట్ల నగదు చలామణి అవుతున్నదని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. మూడేండ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేసిన నాడు ఉన్న నోట్లతో పోలిస్తే 20.14 శాతం అధికం. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించే ఉద్దేశంలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. నవంబర్ 4, 2016న ప్రజల వద్ద రూ.17.97 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా, అక్టోబర్ 25, 2019 నాటికి ఇది 15.2 శాతం పెరిగి రూ.21.59 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles