మూడేండ్లలో 5 వేల కోట్ల టర్నోవర్

Sat,November 9, 2019 02:18 AM

-ఐసీఎల్ ఫిన్‌కార్ప్ ఎండీ అనిల్
హైదరాబాద్, నవంబర్ 8: బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ ఐసీఎల్ ఫిన్‌కార్ప్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దక్షిణ భారతంలో 157 శాఖలను నిర్వహిస్తున్న సంస్థ... 2022 నాటికి వెయ్యి శాఖలను ఏర్పాటు చేయ డంతోపాటు రూ.5 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేజీ అనిల్ కుమార్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ టర్నోవర్ రూ.700 కోట్లుగా ఉన్నది. అలాగే ప్రస్తుతం సంస్థలో 927 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే మూడేండ్లలో 5 వేలకు పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్తర భారతంలో వ్యాపార విస్తరణలో భాగంగా కోల్‌కతాకు చెందిన సాలెమ్ ఎరోడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌లో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ రూ.10 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. వీటితోపాటు వచ్చే మార్చి నాటికి నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.100 కోట్ల నిధులను సేకరించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles