బాస్‌ల కంటే మేమే బెటర్!

Wed,September 11, 2019 02:24 AM

95% Indians confident they can do their manager's job better

ముంబై: మా బాస్‌ల కంటే మేమే ఎక్కువగా పని చేయగలమన్న ఆత్మవిశ్వాసం దిగువ శ్రేణి ఉద్యోగుల్లో కనిపిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాసరే వారి స్థానంలో తాముం టే మెరుగ్గా పనిచేస్తామన్న ధీమా మెజారిటీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూలై 31 నుంచి ఈ ఏడాది ఆగస్టు 9 మధ్య క్రోనోస్ ఇన్‌కార్పొరేటెడ్ తరఫున ఫ్యూచర్ వర్క్‌ప్లేస్ ఓ సర్వేను చేపట్టింది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, బ్రిటన్, అమెరికా దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది. దీని ప్రకారం ప్రస్తుత మేనేజర్ల తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. 95 శాతం మంది భారతీయ ఉద్యోగులు వారి కంటే మేము ఇంకా బాగా పని చేస్తామని అభిప్రాయపడ్డారు. అన్ని సమయాల్లో ప్రభావవంతంగా పని చేస్తామని 47 శాతం మంది, కొన్ని సమయాల్లో బాగా పని చేస్తామని 48 శాతం మంది చెప్పారు. ఇక మెక్సికన్లలో ఇది 87 శాతం ఉండగా, ఫ్రాన్స్ (71 శాతం), కెనడా (61 శాతం), అమెరికా (59 శాతం) ఉద్యోగులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles