ఏసీ మిర్చి క్వింటాల్ ధర రూ.20,021

Sat,November 9, 2019 12:47 AM

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ఏసీ రకం తేజా మిర్చి పంటకు రికార్డు స్థాయిలో రూ. 20,021 ధర పలికింది. మార్కెట్ పరిధిలోని శీతల గిడ్డంగుల్లో నిర్వహించిన క్రయవిక్రయాల్లో ఖరీదుదారులు పోటీపడి కొనుగోలు చేశారు. పక్షం రోజుల క్రితం ఇదే రకానికి రూ.14 వేల లోపు మాత్రమే పలికింది. తాలు రకం పంటకు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతుండటం విశేషం.

66
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles