గుండె చికిత్సకు చిరునామాగా ఏఐజీ

Sat,November 9, 2019 12:54 AM

-కేర్ నుంచి ఏఐజీలో చేరిన సోమరాజు బృందం
-ఏఐజీ దవాఖానల చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గుండె వ్యాధిగ్రస్థులకు నాణ్యతతో కూడిన వినూత్న వైద్యసేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఏఐజీ దవాఖానల చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ బీ సోమరాజుతోపాటు ఆయన బృందంలోని సూపర్ స్పెషలిస్టులు ఏఐజీ దవాఖానలో చేరారని వెల్లడించారు. సంక్లిష్టమైన గుండె ఆపరేషన్లను ఈ బృందం నిర్వహిస్తుందని, అత్యాధునిక పరిశోధనలు చేపట్టేందుకు ఈ బృందం అనుభవం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్ నుంచి ఏఐజీ చేరిన సోమరాజు వైద్యబృందంలో గుండె వ్యాధి నిపుణులు సీ నరసింహన్, డీఎన్ కుమార్, రాఘవరాజు, అనుజ్‌కపాడియా, రాజీవ్‌మీనన్, సీ శ్రీదేవి, స్వరూప్ జీ భరాడీ, సౌమెన్ దేవిదత్త, నీల్‌కాంత్ సీ పాటిల్, సచిన్ యాలగుద్రి, దల్‌జీత్ కౌర్‌సగ్గు, జీ కిశోర్, అన్నె ఉదయ్‌కిరణ్, వీరమాచినేని భరత్, భీష్మచౌదరి, ముత్తయ్య, సుబ్రహ్మణ్యం, విక్రమ్‌విఘ్నేశ్, వీ సత్యశీల్‌రెడ్డి, మధుకర్ చీరాల, ఖలీం అక్తర్జ్రాఖీ, విజయరూపేశ్ కాలె ఉన్నట్లు తెలిపారు. ఏఐజీ లోని గుండె వైద్య నిష్ణాతులు డాక్టర్ ఆర్‌ప్రసాద్‌రెడ్డి, అరుంధతి బోర్డోలోయి, గోవింద్‌జాదవ్, కార్డియాలజీ సర్జన్లు నరేశ్‌కుమార్‌తో కలిసి సోమరాజు అధునాతన వైద్యసేవలను అందిస్తారని వెల్లడించారు. వీరి చేరికతో ఏఐజీలో 150 మందికి పైగా కన్సల్జెంట్ వైద్యులున్నారని గ్యాస్ట్రో సైన్సెస్, కార్డియాక్ సైన్స్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పల్మనరీ సైన్సెస్‌తదితర ప్రత్యేకతలు తమవని వివరించారు.

ఏఐజీలో ఎన్నో ప్రత్యేకతలు

ఏఐజీ హాస్పిటల్ గ్రాస్ట్రో ఎంటరాలజీ సేవల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని, అనుభవజ్ఞులతో పరిశోధనలు జరుపుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో క్లినికల్ ఎక్స్‌లెన్స్‌ను రూపొందించామని ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఎండోస్కోపి రెట్రోగ్రేడ్ కొలాంగియోప్యాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ) విధానాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచంలో తొలి ట్రాన్స్‌గ్యాస్ట్రిక్ అపెండెక్టమీతోపాటు భారతదే శం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అనేక గ్యాస్ట్రోఎంటరాలజీ విధానాలు, శస్త్రచికిత్సలను ఏఐజీలో చేశామని వివరించారు. aighospitals.com వెబ్‌సైట్‌లో సేవల వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles