ఎయిర్‌టెల్ రూ.25 వేల కోట్ల రైట్స్ ఇష్యూ

Sat,April 20, 2019 01:56 AM

Airtel Rs 25,000 crore rights issue, BSE

-మే 3 నుంచి 17 మధ్యకాలంలో

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ రూ.25 వేల కోట్ల అతిపెద్ద రైట్స్ ఇష్యూకి శ్రీకారంచుట్టింది. వచ్చే నెల 3న ప్రారంభంకానున్న ఈ రైట్స్ ఇష్యూ అదే నెల 17న ముగియనున్నదని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ రైట్స్ ఇష్యూపై శుక్రవారం సమావేశమైన బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్లిట్ దరఖాస్తులను మాత్రం మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ సూచించింది. గడిచిన నెల చివర్లో రైట్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లు, మరో రూ.7 వేల కోట్లను బాండ్లను జారీ చేయడం ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఒక్కో షేరు ధరను రూ.220గా నిర్ణయించింది. ముకేశ్ అంబానీకి చెందిన జియో ఎదురవుతున్న పోటీని తట్టుకోడానికి భారతీ ఎయిర్‌టెల్ పెట్టుబడులను మరింత పెంచింది. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ కెపాసిటీని మరింత విస్తరించడానికి, నూతన టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నది. వ్యాపార విస్తరణకు అవసరమైన రూ.32 వేల కోట్ల ప్రణాళికలో మేము పాల్గొంటామని ఇప్పటికే ఎయిర్‌టెల్‌లో అత్యధిక వాటా కలిగిన సింగ్‌టెల్, జీఐసీ సింగపూర్‌లు ప్రకటించాయి. సింగపూర్‌కు చెందిన టెలికం దిగ్గజం సింగ్‌టెల్ రూ.3,750 కోట్ల నిధులను ఎయిర్‌టెల్‌లో చొప్పించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది.

714
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles