అప్పులన్ని చెల్లిస్తా..

Wed,June 12, 2019 01:21 AM

All debt obligations of Reliance Group will be met

-14 నెలల్లో రూ.35 వేల కోట్లు చెల్లించాం: అనిల్ అంబానీ

న్యూఢిల్లీ/ముంబై, జూన్ 11: అప్పులన్నీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ప్రకటించారు. గడిచిన 14 నెలల్లోనే ఏకంగా రూ.35 వేల కోట్ల రుణాలను చెల్లించినట్లు, మిగతా రుణాలను సరైన సమయంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రుణాలు ఇచ్చే సంస్థల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ ఏప్రిల్ 1, 2018 నుంచి మే 31, 2019 మధ్యకాలంలో రూ.24,800 కోట్ల రుణాలు తీర్చగా, రూ.10,600 కోట్ల మేర వడ్డీల రూపంలో చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఎరిక్‌సన్‌కు రూ.550 కోట్లను సరైన సమయంలో చెల్లించకపోవడంతో తన అన్న ముకేశ్ అంబానీ ఆర్థికంగా ఆదుకోవడంతో జైలు శిక్ష నుంచి బయట పడిన విషయం తెలిసిందే. గడిచిన కొన్ని వారాలుగా రేడియో స్టేషన్, మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని విక్రయించిన సంస్థ..జనరల్ ఇన్సూరెన్స్ యూనిట్‌ను విక్రయించడానికి పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గడిచిన కొన్ని రోజులుగా సంస్థపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అడాగ్ గ్రూపునకు చెందిన ఆర్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు జనవరి నుంచి 65 శాతం వరకు పడిపోయిన నేపథ్యంలో అంబానీ మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం గ్రూపునకు ఉన్న మొత్తం బకాయిలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని, సమయానుకూలంగా కొంత ఆలస్యమవనున్నప్పటికీ పూర్తిగా తీర్చడంలో మాత్రం వెనుకంజ వేసే అవకాశాలు లేవని, ఇందుకోసం గ్రూపునకు ఉన్న అన్ని ఆస్తులను విక్రయించనున్నట్లు అనిల్ తెలిపారు.

2190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles