తెగ కొనేశారు..

Thu,October 10, 2019 01:03 AM

పండుగ సీజన్‌లో రూ.39 వేల కోట్ల అమ్మకాలు
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ఆఫర్లకు కస్టమర్లు ఫిదా

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఈ-కామర్స్ కంపెనీలు ప్రకటించిన ఆఫర్లకు కొనుగోలుదారులు ఫిదా అయ్యారు. ప్రస్తుత పండుగ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లతో 6 బిలియన్ డాలర్లు లేదా రూ.39 వేల కోట్ల విలువైన వస్తువులు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ రెడ్‌సీర్ వెల్లడించింది. తొలి విడుత నిర్వహించిన పండుగ విక్రయాల్లో ఈ-కామర్స్ కంపెనీలు 3 బిలియన్ డాలర్లు లేదా రూ.19 వేల కోట్లు ఉంటుందని అంచనావేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన దాంతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. ఈ ఏడాది తొలి విడుత పండుగ సేల్ 3.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని రెడ్‌సీర్స్ అంచనావేసింది. మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ గ్రాస్ మర్చేండైజ్ వాల్యు(జీఎంవీ) 3 బిలియన్ డాలర్లకు ఎగబాకిందని, ఆన్‌లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదని రెడ్‌సీర్ కన్సల్టింగ్ ఫౌండర్, సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. సర్వేలోని పలు ముఖ్య అంశాలు..

-దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అమ్ముడైన వస్తువుల్లో గ్రామీణ ప్రాంతాల వాటా క్రమంగా పెరుగుతున్నది
-రాయితీలు, రిటర్నులు, రద్దు, క్యాష్‌బ్యాక్ ప్రొడక్టులు అత్యధికంగా అమ్ముడయ్యాయి.
-కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ సంస్థలు ఇలా ప్రత్యే క ఆఫర్లను తెరపైకి తీసుకొస్తున్నాయి.
-విక్రయాల్లో మొబైల్ ఫోన్ల వాటా అత్యధికంగా 55 శాతంగా ఉన్నది.
-సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ప్రకటించిన ప్రత్యేక రాయితీ ఆఫర్ల మొత్తం సేల్స్‌లో వీటి వాటా 90 శాతం.
-గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్‌లో అమెజాన్‌లో 51 శాతం విక్రయాలు జరిపింది.
-50 నగరాల్లో 1.90 లక్షల మంది డిజిటల్ యూజర్ల నుంచి సేకరించిన సమాచారంగా ఈ సర్వేను నిర్ణయించింది.

400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles