ఆంధ్రా బ్యాంక్ లాభం రూ.70 కోట్లు

Fri,November 8, 2019 12:18 AM

హైదరాబాద్, నవంబర్ 7: ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రా బ్యాంక్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల్లో బ్యాంక్ రూ.70 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది రూ.434 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గతేడాది రూ.5,249 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ. 5,603 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. వీటిలో వడ్డీల రూపంలో రూ. 4,958 కోట్లు రాగా, వడ్డీయేతర రూపంలో రూ.644 కోట్లు లభించాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ కేటాయింపులు 24 శాతం తగ్గి రూ.1,316 కోట్లకు పడిపోవడం బ్యాంక్‌కు కలిసొచ్చింది. సమీక్ష కాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ అడ్వాన్స్‌లో 16.21 శాతానికి (రూ. 28, 974 కోట్లు)కు తగ్గగా, నికర ఎన్‌పీఏ 5.73 శాతానికి(రూ. 9,091 కోట్లు) పరిమితమైంది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 3.23 శాతంగా నమోదైంది. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో రూ.11, 040 కోట్ల ఆదాయంపై రూ.112 కోట్ల లాభాన్ని గడించింది. ప్రస్తుతం బ్యాంక్ 2,876 శాఖలను నిర్వహిస్తున్నది. గత త్రైమాసికం చివరినాటికి రూ.42,179 కోట్ల వ్యక్తిగత రుణాలు ఇచ్చిన బ్యాంక్, వ్యవసాయ రంగానికి రూ.35,961 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.31,553 కోట్ల చొప్పున అందచేసింది.

228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles