మాకు న్యాయం చేయండి

Sat,September 7, 2019 01:10 AM

Andhra Bank staff protest proposed merger

-ఆంధ్రాబ్యాంకు యాజమాన్యాన్ని కోరిన తెలంగాణ ఉద్యోగుల సంఘం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వరంగ బ్యాంకైన ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనమవనుండటంతో తెలంగాణ ఉద్యోగులకు జరిగే నష్టాన్ని నివారించాలని, వీరికి సరైన న్యాయం చేయాలని ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ బక్కయ్య కోరారు. ఈ మేరకు చిన్న తరగతి ఉద్యోగులు, స్వీపర్లు, సబ్- స్టాఫ్, క్లర్క్‌లను విలీనమవనున్న బ్యాంకులో నియమించాలని ఆయన సూచించారు. అలాగే తెలంగాణలో ఉన్న ఆంధ్రాబ్యాంకు, యూనియన్ బ్యాంకుల అన్ని శాఖలను మూసివేయకుండా అలాగే కొనసాగించాలన్నారు. తెలంగాణ ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు, ప్యానల్ అడ్వకేట్ల, చార్టడ్ అకౌంటెంట్ల నియామకం, తాత్కాలిక ఉద్యోగుల నియామకాల్లో తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని అలాగే కొనసాగించాలని, బ్యాంకు సిబ్బంది నియామక బోర్డులలో తెలంగాణ వారిని నియమించాలన్నారు. అలాగే బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles