పోలవరం హైడల్ పనులకు ఏపీ హైకోర్టు బ్రేక్

Sat,November 9, 2019 12:51 AM

అమరావతి: పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులకు ఏపీ హైకోర్టు మరోసారి బ్రేక్ వేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన న్యాయస్థానం హైడల్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పనుల నిలిపివేతతో అన్ని విధాలుగా నష్టం వాటిల్లుతుందని, వరదలు మళ్లీ మొదలైతే పనులు చేపట్టడం కష్టమని ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించారు. ఈ వాదనతో ఏకీభవించని హైకోర్టు పనులు మరో 15 రోజులు నిలిచిపోయినా ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించింది. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని, నవయుగకు అప్పగించిన పనులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి పనుల కాంట్రాక్టును మేఘా సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. మేఘా సంస్థ స్పిల్‌వే పనులను ప్రారంభించాక ఏపీ హైకోర్టు స్టే విధించింది.

152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles