లిమిటెడ్ ఎడిషన్‌గా క్యూ7

Thu,September 12, 2019 04:01 AM

Audi Q7 Black Edition Launched Limited to Just 100 Units

- ప్రారంభ ధర రూ.82.15 లక్షలు


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్‌గా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్ క్యూ7ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.82.15 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయించనున్న ఈ నూతన వాహనంలో పలు నూతన ఫీచర్స్‌ను జతపరిచినట్లు ఆడీ ఇండియా హెడ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించింది. వీటిలో 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు 245 హర్స్‌పవర్ల శక్తినివ్వనుండగా, 3 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన కారు 249 హెచ్‌పీల శక్తినివ్వనున్నది.

291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles