బీవోబీ లాభం 737 కోట్లు

Sat,November 9, 2019 02:29 AM

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను బ్యాంక్ రూ.736.68 కోట్ల లాభాన్ని గడించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.425. 38 కోట్ల లాభంతో పోలిస్తే 73.2 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ. 13,429.95 కోట్ల నుంచి రూ. 22,097.91 కోట్ల ఆదాయాన్ని గడించింది.


గత త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏఎస్) 10.25 శాతానికి(రూ.69,968.95 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇది 11.78 శాతం(రూ.55,121.37 కోట్లు)గా ఉన్నది. అలాగే నికర ఎన్‌పీఏ కూడా 4.86 శాతం(రూ.21,059.22 కోట్లు) నుంచి 3.91 శాతానికి(రూ. 24,894.38 కోట్లు) తగ్గింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.3,425.33 కోట్ల నిధులను వెచ్చించింది. గతేడాది ఇదేకాలానికి కేటాయించిన రూ.1,466.56 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. గత త్రైమాసికంలో మూలనిధి కింద కేంద్ర ప్రభుత్వం బ్యాంక్‌కు రూ.7 వేల కోట్ల నిధులను కేటాయించింది. బ్యాంక్ షేరు ధర 2.39 శాతం తగ్గి రూ.93.80 వద్ద ముగిసింది.

217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles