బీవోఐ పండుగ ఆఫర్

Mon,September 9, 2019 12:04 AM

Bank of India launches festive offer

-ప్రాసెసింగ్ చార్జీలు ఎత్తివేత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. గృహ రుణాలపై ప్రత్యేక వడ్డీ ఆఫర్‌తోపాటు అన్ని రకాల రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు బ్యాంక్ జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ స్వైన్ తెలిపారు. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.30 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారికి వార్షిక వడ్డీని 8.35 శాతం ఆఫర్ చేస్తున్నది. అంతకంటే ఎక్కువ రుణాలను రెపో రేటుకు లింక్ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇదే సమయంలో విద్యా రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తున్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించడంలో భాగంగా బ్యాంక్ ప్రకటించిన వెల్‌కమ్ ఆఫర్ కింద రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల లోపు రుణం తీసుకున్న వారికి తక్కువ వడ్డీకే ఆఫర్ చేస్తున్నది. గత నెలలో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ పలు ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles