జెట్‌ను టేకోవర్ చేయండి

Sat,April 20, 2019 02:08 AM

Bank unions write to PM Modi want government to take over Jet Airways

-ప్రధానిని కోరిన బ్యాంకింగ్ యూనియన్లు<జblockquote>
ముంబై, ఏప్రిల్ 19: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ను కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని బ్యాంకింగ్ యూనియన్లు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సంస్థలో పనిచేస్తున్న 22 వేల మంది రోడ్డున పడకుండా ఉండాలంటే కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మోదీకి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరింది. రెక్కలు విరిగిన ఎయిర్‌లైన్స్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి మరిన్ని రుణాలు ఇవ్వాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావద్దని, దీనిని టేకోవర్ చేయడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని సూచించారు. 25 ఏండ్లుగా విమాన సేవలు అందించిన జెట్ ఎయిర్‌వేస్..ఈ బుధవారం అర్ధరాత్రి నుంచి తన విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జెట్ ఎయిర్‌వేస్‌ను టేకోవర్ చేయడానికి నిర్వహించిన బిడ్డింగ్‌లో ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో బ్యాంకులు దీని నుంచి చాలా నేర్చుకున్నాయని, 22 వేల మంది సిబ్బంది భవిష్యత్తు ఆధారంగా ఎయిర్‌లైన్స్‌ను టేకోవర్ చేయాలని అసోసియేషన్ సూచించింది.

స్పైస్‌జెట్‌లోకి 500 మంది జెట్ ఉద్యోగులు

రోడ్డున పడ్డ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులను మరో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అక్కున చేర్చుకున్నది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 100 మంది పైలెట్లతోపాటు 500 మంది సిబ్బందిని స్పైస్‌జెట్ నియమించుకున్నది. ఈ సందర్భంగా స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ మాట్లాడుతూ..తొలి ప్రాధాన్యత జెట్ ఎయిర్‌వేస్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడమేనని తెలిపారు. ఇప్పటికే 100 మంది పైలెట్లు, 200 క్యాబిన్ క్రూ, 200 మంది టెక్నికల్, ఎయిర్‌పోర్ట్ స్టాఫ్‌ను నియమించుకున్నది.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles