ఆర్బీఐ ఉత్తర్వులను పాటించాలి

Sun,September 22, 2019 01:09 AM

-ఎమ్మెస్‌ఎంఈలకు విరివిగా రుణాలివ్వాలి
-ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించివద్దని రిజర్వు బ్యాంక్ సూచనలను బ్యాంకర్లు ఖచ్చితంగా పాటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎమ్మెస్‌ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందించి ఆదుకోవాలని ఆయన సూచించారు. శనివారం బషీర్‌బాగ్ పరిశ్రమ భవన్‌లో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఖాయిలపడిన పరిశ్రమలను ఆదుకోవడానికి బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఎస్బీఐతో తెలంగాణ ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్ అధికారులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెస్‌ఎంఈ రంగంలో ఖాయిలా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవడానికి బ్యాంకర్లు ముందుకురావాలని సూచించారు. మాంద్యం నేపథ్యంలో ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న ఎమ్మెస్‌ఎంఈలను 2020 మార్చి నాటికి ఖాయిలా పరిశ్రమలుగా ప్రకటించవద్దని కేంద్ర ఆర్ధిక మంత్రి, ఆర్బీఐ తెలిపినట్లుగా జయేశ్ రంజన్ వివరించారు. గతంలో పరిశ్రమలకు సరియైన విద్యుత్ సరఫరా చేయకపోవడం, పవర్ హాలిడేలతో ఎమ్మెస్‌ఎంఈలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అన్నారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలు ఖాయిలా పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీయల్ హెల్త్ క్లీనిక్ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెస్‌ఎంఈల్లో అవగాహన పెంచడానికి అక్టోబరు 7 నుంచి షామియానా సమావేశాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌బీఐ డీజీఎం దేబాశీష్ మిశ్రా తెలిపారు. ఈ సమావేశంలో టీఐహెచ్‌సీఎల్ సీఈవో సంజయ, టీఐహెచ్‌సీఎల్ సలహాదారు ఎర్రంరాజు తదితరులు పాల్గొన్నారు.

257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles