మార్కెట్లోకి సరికొత్త బీఎండబ్ల్యూ ఎం5 కాంపిటీషన్

Tue,October 8, 2019 12:34 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారతీయ మార్కెట్లోకి సోమవారం తమ ప్రీమియం సెడాన్ ఎం5 కాంపిటీషన్ అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీని విలువ రూ.1.55 కోట్లు (ఎక్స్‌షోరూం). 8-సిలిండర్ పెట్రోల్ పవర్‌ట్రైన్‌తో వస్తున్న ఈ కారు.. కేవలం 3.3 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 625 హెచ్‌పీ ఇంజిన్, 8-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ దీని సొంతమని ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, సీవోవో రుద్రతేజ్ సింగ్ తెలిపారు. అన్ని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో ఈ కారు అందుబాటులో ఉంటుందన్నారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles