2,500 కోట్లు వసూల్ చేస్తాం

Mon,August 19, 2019 03:14 AM

BOI hoping to recover around Rs 2500 crore in 2 to 3 quarters says official

-రుణాల రికవరీపై బీవోఐ ఈడీ చైతన్య
హైదరాబాద్, ఆగస్టు 18: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)..మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) కింద ఉన్న 10 అతిపెద్ద మొండి బకాయిలను పరిష్కరించడం ద్వారా రూ.2,500 కోట్ల వరకు రుణాలు రికవరీ కాగలవని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీజీ చైతన్య ఆశాభావం వ్యక్తంచేశారు. వీటిలో అతిపెద్ద కేసులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని, మరో రెండు నుంచి మూడు త్రైమాసికంలో మొత్తం కేసులను పరిష్కరించగల ధీమాను ఆయన వ్యక్తంచేశారు. బ్యాంక్ మొండి బకాయిల్లో అతిపెద్దవి 8 నుంచి 10 గుర్తించినట్లు, వీటిని ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీకి అప్పగించడం జరిగిందని, వీటికి పరిష్కారం లభిస్తే బ్యాంక్ రూ.1,500 కోట్ల లాభాన్ని గడించే అవకాశం ఉంటుందన్నారు.

మొండి బకాయిలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న బ్యాంక్..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, ఈ జాబితాలోకి కొత్త రుణాలు వచ్చే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు-సమస్యలపైన చర్చించడానికి హైదరాబాద్‌లో జరుగుతున్న రెండు రోజుల జోనల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇలా ప్రభుత్వ రంగ బ్యాంక్ వర్గాలు చర్చించడం ఇదే తొలిసారని పేర్కొన్న ఆయన.. వ్యాపారాభివృద్ధి, మరింతగా రుణాల పంపిణీలపై దృష్టి పెట్టడంలో భాగంగా వయో వృద్దులు, రైతులు, చిన్న స్థాయి పరిశ్రమలు, యువత, మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో డిజిటల్ పేమెంట్స్, కార్పొరేట్ పాలన మరింత పారదర్శకంగా ఉండటం, రిటైల్, ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయం, ఎగుమతుల రంగాలకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వడంతో 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడానికి మరింత సులభతరం అవుతుందన్నారు.

321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles