దేశం విడిచి వెళ్లొద్దు

Fri,November 8, 2019 12:17 AM

-డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లకు బాంబే హైకోర్టు ఆదేశం
ముంబై, నవంబర్ 7: ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ దీవాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) ప్రమోటర్లను దేశం విడిచి వెళ్లరాదని బాంబే హైకోర్టు ఆదేశించింది. జిగ్నేశ్ షా నేతృత్వంలోని 63 మూన్స్ టెక్నాలజీస్.. డీహెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి తమకు రావాల్సిన దాదాపు రూ.200 కోట్ల బకాయిల వసూలు కోసం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగానే గురువారం పైవిధంగా న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్లు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా దేశం విడిచి వెళ్లొదని జస్టిస్ ఎస్‌జే కత్వాలా స్పష్టం చేశారు. అయితే నిధుల సమీకరణ కోసం వాధవాన్లు విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్ కోర్టుకు తెలిపింది. దీంతో ఒకవేళ విదేశాలకు వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని న్యాయమూర్తి పేర్కొన్నారు.


కాగా, వాధవాన్లను విదేశాలకు వెళ్లనిస్తే.. తప్పించుకునే ప్రమాదం ఉందని 63 మూన్స్ ఆందోళన వ్య క్తం చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్‌సీడీ)లో 63 మూన్స్ పెట్టుబడులు పెట్టింది. అయితే దీనికి సంబంధించిన సొమ్మును తిరిగి చెల్లించడంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ విఫలమైంది. దీంతోనే 63 మూన్స్ కోర్టు గడప తొక్కింది. మరోవైపు ఈ అంశం ఇప్పటికే డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) పుణె బెంచ్‌లో ఉన్నదని, డిబెంచర్ల కొనుగోలుదారుల తరఫున అందులో పిటిషన్ దాఖలైందని, 63 మూన్స్ పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును డీహెచ్‌ఎఫ్‌ఎల్ కోరుతున్నది. ఈ నెల 14న ఈ కేసు తదుపరి విచారణ జరుగనున్నది.

276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles