బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు నేడు వేతన చెల్లింపులు

Fri,March 15, 2019 12:34 AM

BSNL to clear February salary of employees by Friday

న్యూఢిల్లీ, మార్చి 14: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గడిచిన నెలకుగాను వేతనాలను శుక్రవారం చెల్లించనున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ప్రకటించారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపుల విషయంలో చేయూతనందించిన టెలికం మంత్రి మనోజ్ సిన్హాకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నెలలో ఆదాయం రూ.2,700 కోట్లు రావచ్చునని అంచనావేస్తున్న ఆయన.. దీంట్లో రూ.850 కోట్లను వేతనాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మంత్రి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించిన శ్రీవాత్సవ.. నూతన వినియోగదారులను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌నని ఆయన స్పష్టంచేశారు. నిధులు లేకపోవడంతో ప్రభుత్వరంగ సంస్థలైన బీఎన్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లు గడిచిన నెలకుగాను వేతనాలను చెల్లించలేకపోయిన విషయం తెలిసిందే. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1.76 లక్షల మంది సిబ్బంది ఉండగా, ఎంటీఎన్‌ఎల్‌లో 22 వేల మంది ఉన్నారు.

ఎంటీఎన్‌ఎల్‌కు రూ.171 కోట్లు విడుదల

నిధులు లేక సతమతమవుతున్న టెలికం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకున్నది. గడిచిన నెలకుగాను ఉద్యోగులు జీతభత్యాల కోసం ప్రభుత్వం రూ.171 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ విషయం కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

1302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles