900 శాఖల క్రమబద్దీకరించే యోచనలో బీవోబీ

Mon,May 20, 2019 12:14 AM

BVB in the proposal to regulate 900 branches

న్యూఢిల్లీ, మే 19: బ్యాంకుల విలీనం తర్వాత శాఖల పనితీరును మెరుగుపరిచే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 800 నుంచి 900 శాఖల వరకు క్రమబద్దీకరించాలనుకుంటున్నది. ఏప్రిల్ 1 నుంచి దేనా, విజయ బ్యాంకులు బీవోబీలో విలీనమైన విషయం తెలిసిందే. ఒకే ప్రాంతంలో ఉన్న దేనా, విజయా బ్యాంకుల శాఖలను కొన్నింటిని కొనసాగించి, మరి కొన్నింటిని బీవోబీకి చెందిన శాఖలో విలీనం చేయాల్సి ఉంటుందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడింటికి చెందిన శాఖలు ఒకే ప్రాంతంలో లేదా ఒకే బిల్డింగ్‌లో ఉంటే వీటిలో రెండింటిని మూసి వేయడం కానీ లేదా క్రమబద్దీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. విలీనం తర్వాత దేశవ్యాప్తంగా ఒకేచోట ఉన్న 800-900 శాఖలను గుర్తించినట్లు, వీటిని క్రమ బద్దీకరించడం లేదా మూసివేసే పరిస్థితి కూడా ఏర్పడిందన్నారు. దీంతోపాటు అదనంగా ఉన్న ప్రాంతీయ, జోనల్ కార్యాలయాలను కూడా మూసివేయనున్నారు. దేనా, విజయా బ్యాంకుల విలీనం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా అవతరించింది. ప్రస్తు తం బ్యాంకుకు 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85 వేల మంది ఉద్యోగులు, 12 కోట్ల మంది ఖాతాదారులు కలిగివుండనున్నారు. బ్యాలెన్స్ షీట్ రూ.15 లక్షల కోట్లకు చేరుకోనున్నది. వీటిలో రూ.8.75 లక్షల కోట్లు డిపాజిట్లు కాగా, రూ.6.25 లక్షల కోట్లు అడ్వాన్స్‌లు.

562
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles