బ్యాంక్ మోసాలపై పరిశీలన కమిటీ

Mon,August 26, 2019 12:27 AM

Central Vigilance Commission sets up panel to examine bank Frauds

-రూ.50 కోట్లు అంతకుమించిన కేసులలో కమిటీ సిఫార్సులు కీలకం: సీవీసీ

న్యూఢిల్లీ, ఆగస్టు 25: బ్యాంకింగ్ మోసాలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఓ సలహాదారు బోర్డును ఏర్పాటు చేసింది. మాజీ విజిలెన్స్ కమిషనర్ టీఎం భాసిన్ నేతృత్వంలో ఇది ఏర్పాటైంది. రూ.50 కోట్లు ఆపై విలువగల మోసాలను పరిశీలించి చర్యలకు ఈ బోర్డు సిఫారసు చేస్తుంది. కాగా, ఇంతకుముందు అడ్వైజరీ బోర్డ్ ఆన్ బ్యాంక్, కమర్షియల్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గా ఉండేది. ఇప్పుడు దీన్ని అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ (ఏబీబీఎఫ్)గా మార్చారు. దీనికే భాసిన్‌ను బాస్‌గా నియమించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సంప్రదింపుల అనంతరం దీన్ని ఏర్పాటు చేయగా, ఈ బోర్డులో మొత్తం నలుగురున్నారు. రూ.50 కోట్లు ఆపై విలువగల మోసాలను తొలుత బ్యాంకులు ఈ బోర్డు పరిశీలనకు సూచించాలని, ఆ తర్వాతే బోర్డు చేసిన సిఫార్సుల ఆధారంగా బ్యాంకులు తదుపరి చర్యలకు దిగాలని ఓ ఆదేశంలో సీవీసీ స్పష్టం చేశారు. బోర్డు సభ్యులుగా అర్బన్ డెవలప్‌మెంట్ మాజీ కార్యదర్శి మధుసూదన్ ప్రసాద్, బీఎస్‌ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ డీకే పాథక్, ఆంధ్రా బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో సురేశ్ ఎన్ పటేల్ ఉన్నారు.

267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles