వాడేసిన వంట నూనెతో బయోడీజిల్

Sun,August 11, 2019 01:12 AM

converting used cooking oil into biodiesel in 100 cities

-దేశవ్యాప్తంగా 100 నగరాల్లో తయారీ
-ప్లాంట్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 10: వాడేసిన వంటనూనెను బయోడీజిల్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. ఇందు లో భాగంగానే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)లు ఆసక్తిగల ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకే ఈ ప్రక్రియ. కాగా, మొదటి సంవత్సరం లీటర్‌కు రూ.51 చొప్పున, రెండో సంవత్సరం రూ.52.7, మూడో సంవత్సరం రూ.54.5 చొప్పున ఉత్పాదక సంస్థల నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు బయోడీజిల్‌ను కొనుగోలు చేయనున్నాయి.

326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles