ఆకట్టుకున్న కోరమాండల్

Wed,April 24, 2019 12:01 AM

Coromandel International Q4 net up 23 percent at Rs 110 crore

క్యూ4లో రూ.110 కోట్ల లాభం
హైదరాబాద్, ఏప్రిల్ 23: ఎరువుల తయారీ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల్లో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 23 శాతం ఎగబాకి రూ.110.38 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.89.61 కోట్లుగా ఉన్నది. జనవరి-మార్చి మధ్యకాలంలో ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,64 6.96 కోట్లకు చేరుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సమీర్ గోయెల్ మాట్లాడుతూ..అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచినట్లు, ముఖ్యంగా ఈశాన్య భారతంలో వర్షాలు సరిగా పడకపోయినప్పటికీ అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3.50 శాతం లేదా 350 శాతం తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles