ఇండిగోకు డీజీసీఏ షాక్

Thu,April 18, 2019 12:26 AM

DGCA notice to IndiGo COO over P W engine conducts safety audit

-షోకాజ్ నోటీసులు జారీ
ముంబై, ఏప్రిల్ 17: చౌక విమానయాన సంస్థ ఇండిగోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయంపై పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ సంస్థకు షోకాజ్ నోటీసును జారీ చేసింది. భద్రత విషయంపై కంపెనీకి చెందిన విమానాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించిన డీజీసీఏకు పలు అనుమానాలు వ్యక్తంచేసిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ షోకాజ్ నోటీసుపై ఇండిగో వర్గాలు నిర్దారించారు. దీనిపై డీజీసీఏ చీఫ్ బీఎస్ భుల్లర్ మాట్లాడుతూ..గడిచిన ఏడాదికాలంగా ఆడిట్ వివరాలు అందించలేదన్నారు. సంస్థకు షోకాజ్ నోటీసు జారీపై ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఇండిగో, గోఎయిర్‌లు పీఅండ్‌డబ్ల్యూ ఇంజిన్ కలిగిన ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలను వినియోగిస్తున్నాయి.

570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles