గోయల్‌ను ప్రశ్నించిన ఈడీ

Sat,September 7, 2019 01:14 AM

ED questions Jet founder Naresh Goyal

ముంబై, సెప్టెంబర్ 6: విదేశీ మారక చట్టం ఉల్లంఘన కేసులో మూతపడిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నరేష్ గోయల్‌కు వ్యతిరేకంగా గతేడాది ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఏడాది తర్వాత తొలిసారిగా ఈడీ శుక్రవారం ప్రశ్నించింది. ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు ఈడీ జోనల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. గోయల్‌కు ముంబైలో ఉన్న నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర కంపెనీలు, డైరెక్టర్ల కార్యాలయాలపై గతేడాది ఆగస్టులో ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. గోయల్ నాయకత్వంలో 19 కంపెనీలు నడుస్తుండగా, వీటిలో విదేశాల్లో రిజిస్టార్ అయిన ఐదు సంస్థలు కూడా ఉన్నాయి. కంపెనీకి సంబంధించిన నిర్వహణ ఖర్చులు, సీలింగ్, డిస్ట్రిబ్యూషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునే ఉద్దేశంలో భాగంగా శుక్రవారం నరేష్ గోయల్‌ను ముంబైలో ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. సంస్థ చేసిన ఖర్చు కంటే అధికంగా చేసి చూపించారని, విమానాల లీజుకు సంబంధించి లావాదేవీల్లో కూడా లోసుగులు ఉన్నట్లు గుర్తించింది. దీంతో గోయల్, ఆయన భార్యను విదేశాలకు వెల్లకుండా అడ్డుకున్నారు. 1992లో గోయల్ ఏర్పాటు చేసిన తాలి విండ్స్ కంపెనీ గుండా అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తున్నది. ఈ తాలి విండ్స్ కంపెనీలో అతిపెద్ద పెట్టుబడిదారైన హస్ముఖ్ దీప్‌చంద్ గార్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల ఈడీ సోదాలు చేసింది.

177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles