పీఎంసీ కేసులో ఈడీ దాడులు

Sat,October 5, 2019 01:24 AM

ముంబై, అక్టోబర్ 4: పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్(పీఎంసీ) సంక్షోభానికి కారణమైన వారిపై ఈడీ శుక్రవారం దేశవ్యాప్తంగా ఆరు చోట్ల దాడులు నిర్వహించింది. ఇందుకు కారణమైన వారిపై మనీ ల్యాండరింగ్ కింద కేసును కూడా దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దాడులు చేసింది. ఈ కుంభకోణంలో మరింత సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్ మాజీ మేనేజ్‌మెంట్, హౌజింగ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హెచ్‌డీఐఎల్) ప్రమోటర్లకు వ్యతిరేకంగా ఈడీ, ముంబై పోలీసులు కేసును దాఖలు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 2008 నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ రూ. 4,355.46 కోట్లు నష్టపోయింది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 409, 420, 465, 466, 471 కింద క్రిమినల్ కేసును దాఖలు చేశారు.


బ్యాంక్ మాజీ ఎండీ అరెస్ట్

పీఎంసీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్‌ను ముంబై ఆర్థిక నేరాల విభాగ(ఈవోడబ్ల్యూ) ఉన్నతాధికారులు శుక్రవారం అరెస్ట్‌చేశారు. రూ.4,355 కోట్ల మోసం చేసిన కేసులో ఇప్పటికే ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయంలో థామస్‌ను పోలీసులు ప్రశ్నించారు.

9 వరకు పోలీస్ కస్టడిలో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు

పీఎంసీ బ్యాంకును మోసం చేసిన కేసులో అరస్టైన హెచ్‌డీఐఎల్ సీఎండీ రాకేశ్ వాధావాన్, ఆయన కుమారుడు సారంగ్ వాధావాన్‌లు ఈ నెల 9 వరకు పోలీస్ కస్టడిలో ఉండనున్నారు. ముంబై ఆర్థిక నేరాల విభాగం అరెస్ట్ చేసిన వీరిద్దరిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వీరిద్దరు వచ్చే బుధవారం వరకు పోలీస్ కస్టడిలో ఉండాలని కోర్టు ఆదేశించింది.

280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles