అపోలోతో ఈఈఎస్‌ఎల్ ఒప్పందం

Mon,August 19, 2019 03:12 AM

EESL contract with Apollo

-దేశవ్యాప్తంగా ఆస్పత్రుల వద్ద విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ప్రభుత్వ రంగ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్).. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌తో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా అపోలో ఆస్పత్రుల వద్ద పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకుగాను పదేండ్ల ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆదివారం ఈఈఎస్‌ఎల్ తెలియజేసింది. ఓ ప్రైవేట్ భాగస్వామితో ఈఈఎస్‌ఎల్ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. దేశీయంగా పబ్లిక్ చార్జింగ్ సదుపాయాల ఏర్పాటు కోసం ఈ ఎంవోయూను చేసుకున్నాం అని ఓ ప్రకటనలో ఈఈఎస్‌ఎల్ తెలియజేసింది. ఈ ఎంవోయూలో భాగంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఈఈఎస్‌ఎల్ మొత్తం పెట్టుబడులను పెట్టనున్నది. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి విద్యుత్ ఆధారిత వాహనాలు ఎంతగానో దోహదపడుతాయన్న ఈఈఎస్‌ఎల్.. వాటి చార్జింగ్ సదుపాయాలను మెరుగుపర్చేందుకు నడుం బిగించినట్లు తెలిపింది.

191
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles