అద్భుత కాంక్రీట్ నిర్మాణం కాళేశ్వరం

Tue,September 10, 2019 03:41 AM

ENC Venkateswarlu who gave a presentation on the Kaleshwaram Project

-అవార్డును ప్రకటించిన ఐసీఐ- అల్ట్రాటెక్
-ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఈఎన్సీ వెంకటేశ్వర్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అద్భుత కాంక్రీట్ నిర్మాణంగా అవార్డును సొంతం చేసుకున్నది. ముఖ్యంగా రెండున్నరేండ్లలోనే గోదావరి నదిపై మూడు బరాజ్‌లు, మూడు పంపుహౌస్‌లతో కూడిన ప్రాజెక్టులోని లింక్-1లను అద్భుత (ఔట్‌స్టాండింగ్) కాంక్రీట్ నిర్మాణాలుగా ఐసీఐ- అల్ట్రాటెక్ ప్రకటించిందని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్‌లో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంక్రీట్ డే ఉత్సవాలు, కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డులు-2019 ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ అవార్డును ప్రదానం చేశారని చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్ నిర్మాణంలో ఒకేరోజు ఏడువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు నిర్వహించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. లింక్-1లోని మూడు బరాజ్‌లు, మూడు పంపుహౌస్‌ల నిర్మాణానికి 21 నెలల సమయంలో 73 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిపూర్తిచేయడం సరికొత్త రికార్డుగా నమోదైనందున అద్భుత కాంక్రీట్ నిర్మాణంగా ప్రకటించారని ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ (తెలంగాణ సెంటర్) పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, సీడీవో చీఫ్ ఇంజినీర్ టీ శ్రీనివాస్‌తోపాటు పనులు నిర్వహించిన ఏజెన్సీలు.. రామకృష్ణరాజు (ఎల్‌అండ్‌టీ), శ్రీనివాస్‌రెడ్డి (ఎంఈఐఎల్), మల్లికార్జునరావు (అఫ్‌కాన్స్), వెంకట్రామారావు (నవయుగ) ప్రతినిధులకు కూడా అవార్డులు ప్రదానం చేశారు.

334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles