14 నుంచి బడ్జెట్ కసరత్తు

Mon,October 7, 2019 12:10 AM

-వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ముందస్తు సమావేశాలు
-కేంద్ర ఆర్థిక శాఖ సర్క్యులర్

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ కసరత్తులను మొదలు పెట్టనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూపకల్పన ప్రక్రియను ఈ నెల 14 నుంచి ఆరంభించేస్తున్నది. ఆర్థిక మాంద్యం, రెవిన్యూ వసూళ్లలో మందగమనం సమస్యల పరిష్కారంగా ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ముందస్తు బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 14 నుంచి మొదలవుతాయి. ఆర్థిక సలహాదారులంతా అవసరమైన వివరాలను అందించాలి అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన తాజా బడ్జెట్ సర్క్యులర్ స్పష్టం చేసింది. రెండో విడుత మోదీ సర్కారుకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాబోయే బడ్జెట్ రెండోది అవగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కొత్త బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వీలున్నది.

282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles