మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Sat,November 9, 2019 12:48 AM

-మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపు
కొల్లాపూర్, నమస్తేతెలంగాణ: ప్రభుత్వం సహకారంతో మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీతోపాటు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి సబ్సిడీపై వాహనాలను అందజేస్తున్నదన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెంట్లవెల్లి మం డలం మంచాలకట్టకు చెందిన 20 మంది మత్స్యకారులకు మంజూరైన ద్విచక్ర వాహనాలను కొల్లాపూర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలు అందుకున్న లబ్ధిదారులను వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

49
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles