వచ్చే ఏడాది వృద్ధి 6.8 శాతమే

Sat,March 23, 2019 01:08 AM

Fitch cuts India GDP growth forecast for 6.8 Percent

-అంచనాలో కోత విధించిన ఫిచ్

న్యూఢిల్లీ, మార్చి 22: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. గతంలో అంచనావేసిన స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం లేదని తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఈ ఏడాదికికూడా వృద్ధిని 7.2 శాతానికి బదులు 6.9 శాతానికి కుదించింది సంస్థ. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన 7 శాతం అంచనాకంటే ఇది తక్కువ. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. వచ్చే ఏడాదిలో ముందుగా అంచనావేసినట్లుగా పరిస్థితులు కనిపించడం లేదని, దీంతో వృద్ధిని తగ్గించినట్లు వెల్లడించింది. వరుసగా రెండు త్రైమాసికాలుగా వృద్ధిరేటు క్షీణిస్తున్నదని, ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో 8 శాతంగా నమోదైన వృద్ధి ఆ తర్వాతి త్రైమాసికంలో 7 శాతానికి పడిపోగా, అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో 6.6 శాతానికి జారుకున్నది. తయారీ రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితులకు తోడు వ్యవసాయ రంగం అంతంత మాత్రంగానే వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణాలని విశ్లేషించింది. నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు నిధులు లేక సతమతమవుతుండటం, ద్వి, త్రిచక్ర వాహనాలు పడిపోవడం కూడా వృద్ధికి ఆటంకంగా మారాయని పేర్కొంది. మరోవైపు రూపాయిపై ఆందోళనను వ్యక్తంచేసింది ఫిచ్. ఈ ఏడాది చివరినాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 72 స్థాయికి పడిపోవచ్చునని అంచనావేస్తున్నది. ఆ తర్వాతి ఏడాది డిసెంబర్ వరకు 73 స్థాయికి జారుకోవచ్చునని తెలిపింది. గత పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించిన రిజర్వు బ్యాంక్..ఈ ఏడాది మరో పావు శాతం కోత పెట్టే అవకాశం ఉన్నదని పేర్కొంది.

358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles