పెట్టుబడుల్లో ఎఫ్‌పీఐల జోష్

Mon,April 15, 2019 12:43 AM

Foreign Investors invested 11,000 Cr in April

-ఏప్రిల్‌లో ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతున్నది. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడిదారులు రూ.11,096 కోట్ల మేర నిధులను చొప్పించారు. అంతర్జాతీయ మా ర్కెట్లు నిరాశావాదంగా ఉండటంతో ఎఫ్‌ఐఐలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణమని ఓ నివేదిక వెల్లడించింది. గడిచిన రెండు నెలలుగా ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారని, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఆ మరుసటి నెలలో రూ.45,981 కోట్లను నిధుల రూపంలో పెట్టుబడి పెట్టారు. కానీ, జనవరి నెలలో మాత్రం ఎఫ్‌పీఐలు.. దేశీయ ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.5,360 కోట్లను తరలించుకుపోయారు. ఈ నెల 1 నుంచి 12 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లలోకి రూ.13,308.78 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌పీఐలు..డెబిట్ మార్కెట్ల నుంచి మాత్రం రూ.2,212.08 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో నికరంగా పెట్టుబడి రూ. 11,096.70 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నిలకడైన ప్రభుత్వం రాబోతున్నదన్న అంచనాతో ఫిబ్రవరి నుంచి స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్నదని..మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితులు అగమ్య గోచరంగా తయారవుతుండటంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీలవైపు మొగ్గుచూపారని గ్రోవ్ సీవోవో హరిష్ తెలిపారు. ఈ ఏడాది మరోసారి వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని ఫెడరల్ రిజర్వు ప్రకటించడం కూడా ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. అలాగే వాణిజ్య యుద్ధంపై అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సత్ఫలితాలు ఇస్తాయన్న సంకేతాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు భారత్‌తోపాటు ఇతర దేశాలు కూడా లబ్దిపొందాయని, కానీ, ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికంగా లాభపడ్డాయని తెలిపారు.

356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles