వాయం సింగ్ అరెస్టు

Sun,October 6, 2019 12:38 AM

-పోలీసుల అదుపులో పీఎంసీ బ్యాంక్ మాజీ చైర్మన్
-17దాకా మాజీ ఎండీ థామస్‌కు రిమాండ్

ముంబై, అక్టోబర్ 5: పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్ కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నా యి. శనివారం బ్యాంక్ మాజీ చైర్మన్ వాయం సింగ్‌ను ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ ఎండీ జాయ్ థామస్‌కు ఈ నెల 17 వరకు పోలీస్ కస్టడీని విధించారు. శుక్రవారం థామస్ అరస్టైన విషయం తెలిసిందే. అంతకుముందు గురువారం హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేశ్ వాధవాన్, సారంగ్ వాధవాన్లూ అరస్టైన సంగతీ విదితమే. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా మొత్తం నలుగురు అరస్టైనైట్లెంది. కాగా, శనివారం థామస్‌ను ఇక్కడి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌జీ షేక్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. థామస్‌ను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పడంతో రిమాండ్‌కు ఆదేశించారు. కాగా, తన క్లయింట్‌ను ఈ వ్యవహారంలో బలిపశువును చేశారని థామస్ తరఫున వాదిస్తున్న న్యాయవాది రాకేశ్ సింగ్ అన్నారు. థామస్‌కు నిర్ణయాధికారాలు లేవన్న ఆయన కేవలం ఓ ఉద్యోగి మాత్రమేనని గుర్తుచేశారు. పీఎంసీ బ్యాంక్ నుంచి నిర్మాణ రంగ సంస్థ హెచ్‌డీఐఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు మొత్తం 44 రుణాలు తీసుకున్నాయి. గత నెల 19 నాటికి వీటి విలువ రూ.6,500 కోట్లుగా ఉన్నది. బ్యాంక్ మొత్తం రుణాల్లో ఇది దాదాపు 73 శాతానికి సమానం. అయితే హెచ్‌డీఐఎల్ రుణాలు మొండి బకాయిలుగా మారుతున్నా.. బ్యాంక్ పెద్దలు కొత్త రుణాలను ఇస్తూ పోయారని, దీనివల్ల బ్యాంక్‌కు గడిచిన 11 ఏండ్లలో రూ.4,355 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తెలుస్తున్నది.

బ్యాంక్‌కు వాధవాన్‌ల లేఖ

అరెస్టు కావడానికి రెండు రోజుల ముందు హెచ్‌డీఐఎల్ ప్రమోటైర్లెన వాధవాన్లు బ్యాంక్‌కు ఓ లేఖ రాశారు. అవసరమైతే తాము తీసుకున్న రుణాలకు అదనపు సెక్యూరిటీలు ఇస్తామని ఈ సందర్భంగా వారు ముందుకొచ్చారు. అంతేగాక బకాయిలను తీరుస్తామని, సెటిల్మెంట్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. గత నెల 30న రాసిన ఈ లేఖపై సారంగ్ వాధవాన్ సంతకం ఉండగా, దీన్ని ఆర్బీఐకి పంపినట్లు తెలుస్తున్నది. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో బ్యాంకులు మూతబడ్డాయి. గురువారం వాధవాన్లు అరస్టైన విషయం తెలిసిందే. మధ్యలో సెలవు రాకపోయినైట్లెతే పరిస్థితి వేరేగా ఉండేదని హెచ్‌డీఐఎల్ వర్గాలు అంటున్నాయి.

481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles