1 నుంచి ఆన్‌లైన్ చార్జీలు ఎత్తివేత

Wed,June 12, 2019 01:11 AM

Fund transfers via RTGS, NEFT to cost less from July 1

-ప్రకటించిన రిజర్వు బ్యాంకు

ముంబై, జూన్ 11: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా జరిపే లావాదేవీలపై విధించే చార్జీలను వచ్చే నెల 1 నుంచి ఎత్తివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ మంగళవారం ప్రకటించింది. దీంతో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీలపై ఇక నుంచి ఎలాంటి చెల్లింపులు జరుపాల్సిన అవసరం లేదు. ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ ఖాతాదారులకు అందించాలని ఆర్బీఐ సూచించింది. నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు పంపుకోనుండగా, అదే ఆర్టీజీఎస్ ద్వారా ఎంతైన పంపుకోవచ్చును. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రతి నెఫ్ట్ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.5 వరకు వడ్డీస్తుండగా, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నది. ఈ నెల 6న తన పరపతి సమీక్షలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.

ఏటీఎం చార్జీలపై కమిటీ

ఏటీఎం చార్జీలను, బ్యాంకుల ఫీజులను సమీక్షించడానికి ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీజీ కన్నన్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీని రిజర్వు బ్యాంక్ మంగళవారం ఏర్పాటు చేసింది. అత్యధికంగా వినియోగిస్తున్న ఏటీఎంపై చార్జీలు అధికంగా ఉన్నాయని సామాన్యుడి నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రిజర్వు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆరుగురు సభ్యులు కలిగిన ఈ కమిటీలో దిలీప్ అస్బే(ఎన్‌పీసీఐ సీఈవో), గిరి కుమార్ నాయర్(ఎస్‌బీఐ సీజీఎం), ఎస్ సంపత్ కుమార్(హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లయబిల్టి గ్రూపు హెడ్), కే శ్రీనివాస్(ఏటీఎం ఇండస్ట్రీ బాడీ డైరెక్టర్), సంజీవ్ పటేల్(టాటా కమ్యూనికేషన్స్ పేమెం ట్ సొల్యుషన్స్ సీఈవో)లు ఉన్నారు. కాగా, గురువారం వ్యవస్థలోకి ఆర్బీఐ 15 వేల కోట్ల నిధులను చొప్పించనున్నది.

1851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles