ఎఫ్‌ఎంసీజీలో వివేక్ టాప్

Mon,August 12, 2019 02:02 AM

Godrej Consumers Vivek Gambhir highest paid FMCG CEO in FY19

-గతేడాదికిగాను అందుకున్న జీతం రూ.20 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 11: గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న వారిలో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వివేక్ గంభీర్ ముందువరుసలో నిలిచారు. గతేడాది ఆయనకు రెమ్యునరేషన్ రూపంలో రూ.20.09 కోట్లు లభించాయి. ఆ తర్వాతి స్థానంలో హెచ్‌యూఎల్ చీఫ్ సంజీవ్ మెహతా రూ.18.88 కోట్లు పొందారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీలు విడుదల చేసిన వార్షిక నివేదికల ప్రకారం ఈ విషయం వెల్లడైంది. దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థల్లో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, డాబర్, మారికో, ఇమామీలు ఉన్నాయి. గతేడాదికిగాను గంభీర్ మొత్తం రెమ్యునరేషన్ కింద రూ.20,09,42,847 అందుకోగా, సగటు ఉద్యోగి పొందిన జీతంతో పోలిస్తే 331.26 రెట్లు అధికం. నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయనన్ రూ.11.09 కోట్ల వేతనంలో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. సగటు ఉద్యోగితో పోలిస్తే ఈయన వేతనం 106 రెట్లు అధికం. నెస్లే కంపెనీ జనవరి-డిసెంబర్ మధ్యకాలాన్ని వార్షిక సంవత్సరంగా వ్యవహరిస్తున్నది. అలాగే డాబర్ ఇండియా హోల్‌టైం డైరెక్టర్ పీడీ నారంగ్ రూ.10,77,17,010ల వేతనాన్ని పొందారు. మారికో ఎండీ, సీఈవో సౌగాట గుప్తా రూ.9,21,91,648లతో ఆరోస్థానంలో నిలువగా, జీసీపీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ నిశాబా గోద్రేజ్ రూ.6,87,56,036లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. ఇమామీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్‌ఎస్ అగర్వాల్ రూ.6.54 కోట్లు అందుకున్నారు.

176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles