తగ్గుతున్న పసిడి మెరుపులు

Sat,April 20, 2019 02:00 AM

Gold consumption is steadily declining

-2018-19లో 3% తగ్గిన దిగుమతి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశవ్యాప్తంగా బంగారం వాడకం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ధరలు భగ్గుమంటుండటం, మరోవైపు సామాన్యులు అతి విలువైన లోహాలు కొనుగోలు చేయడానికి వెనుకంజ వేయడంతో డిమాండ్ తగ్గిపోతున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ 32.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది చేసుకున్న 33.7 బిలియన్ డాలర్ల కంటే 3 శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ధరలు నిలకడగా కొనసాగుతున్నప్పటికీ..అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా దిగుమతులు తగ్గుముఖం పట్టాయని వాణిజ్య విశ్లేషకులు వెల్లడించారు. పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు మరింత తగ్గనున్నది. ఫిబ్రవరి నెలలో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న పసిడి దిగుమతులు..ఆ మరుసటి నెలలో ఏకంగా 31.22 శాతం పెరిగి 3.27 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటని, ఆభరణాల వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో దిగుమతులు అమాంతం పెరుగుతున్నాయి. మరోవైపు ఆభరణాల ఎగుమతిదారులకు ఊరట లభిస్తున్నది. బంగారం దిగుమతులు పెరుగుతుంటే.. జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతిదారులకు తమ ఆభరణాలను ఎగుమతులను పెంచుకోవడానికి వీలు కలుగుతున్నది.

3633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles