దిగొస్తున్న బంగారం

Tue,September 10, 2019 03:37 AM

Gold prices drop Rs 300 silver tumbles Rs 1,400

-రూ.300 తగ్గిన తులం ధర
-రూ.1,400 చౌకైన వెండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9:ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయంగా డిమాండ్ పడిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలోపేతం కావడంతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర రూ.300 తగ్గింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.39,225 వద్ద స్థిరపడినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. పసిడి బాటలో వెండి పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్ళకు మొగ్గుచూపకపోవడంతో వెండి ఏకంగా రూ.1,400 తగ్గి రూ.48,500 వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరల కారణంగా గత కొన్ని రోజులుగా అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయని, పండుగ సీజన్ ఆరంభమైనప్పటికీ అతి విలువైన లోహాల డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు ఎగబాకడం, అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ధరలు దిగువముఖం పట్టాయని ఆయన చెప్పారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,506 డాలర్లకు పడిపోగా, వెండి 18.05 డాలర్లకు జారుకున్నది.

2424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles