చివరి అవకాశం చేజారింది

Mon,September 23, 2019 12:23 AM

ఔరంగబాద్, సెప్టెంబర్ 22: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉన్న చివరి అవకాశాన్ని మోదీ సర్కారు ఎప్పుడో చేజార్చుకున్నదని ప్రముఖ ఆర్థికవేత్త హెచ్‌ఎం డేసర్డా అన్నారు. ఐదేండ్ల క్రితం ముడి చమురు ధరలు చాలా తక్కువగా ఉన్నాయని గుర్తుచేసిన ఆయన ఆ సమయంలో జీడీపీ పరిపుష్ఠికి ఉన్న అవకాశాలను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఉపయోగించుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ఆర్థిక పతనం-కారణాలు, ప్రభావాలు, నివారణలు అన్న అంశంపై మాట్లాడుతూ దేశ ఇంధన అవసరాలు 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో ముడి చమురును కేంద్రం దిగుమతి చేసుకుంటే ఇప్పుడు బాధపడాల్సి వచ్చేది కాదన్నారు.

233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles