సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.9,500 కోట్లు

Sat,March 23, 2019 01:01 AM

Govt gets bids worth Rs 9,500 crore

-కేంద్ర ఖజానాకు జమకానున్న నిధులు

న్యూఢిల్లీ, మార్చి 22: కేంద్ర ప్రభుత్వం ఐదో సారి జారీ చేసిన సీపీఎస్‌ఈ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లకు రూ.9,500 కోట్ల విలువైన బిడ్డింగ్‌లు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 19న జారీ చేసిన తొలిరోజే యాంకర్ ఇన్వెస్టర్లు రూ.6,072 కోట్ల బిడ్లు దాఖలు చేయగా, చివరి రోజు(శుక్రవారం) వరకు మరింత పెరిగాయని చెప్పారు. మిగతా రూ.3,500 కోట్లు సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి వచ్చాయి. దీంతో ఐదోసారి జారీ చేసి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లకు రూ.9,500 కోట్ల బిడ్లు వచ్చాయి. మూడు రోజులపాటు విక్రయించడం ద్వారా రూ.3,500 కోట్లు సేకరించాలని కేంద్రం సంకల్పించింది. కానీ, రిటైల్, ఇతర పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన రావడంతో రూ.9 వేల కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. వీరిలో బీఎన్‌పీ పరిబాస్ అర్బిట్రేజ్, సిటీ గ్రూపు గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడిట్ స్యూస్ సింగపూర్ లిమిటెడ్, ఎడల్‌వైస్ ఆల్ఫా ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బాలెన్స్‌డ్ అడ్వాంటెజ్ ఫండ్, మెరిల్ల్ లించ్ మార్కెట్స్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, మోర్గాన్ స్టాన్లీ(ఫ్రాన్స్)తోపాటు ఇతర సంస్థలు ఉన్నాయి. అలాగే ఈటీఎఫ్ ట్రాక్స్ షేర్లలో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్ప్, పవర్ ఫైనాన్స్ కార్ప్, భరత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్‌బీసీసీ ఇండియా, ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎస్‌జేవీఎన్‌లు ఉన్నాయి. గడిచిన ఐదుసార్లుజారీ చేసిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లతో కేంద్రానికి రూ.28,500 కోట్లు సమకూరాయి. వీటిలో తొలి విడుత మార్చి, 2014లో జారీ చేయడంతో రూ.3 వేల కోట్లు రాగా, జనవరి 2017లో మరోసారి రూ.6 వేల కోట్లు, మార్చి 2017లో రూ.2,500 కోట్లు, నవంబర్ 2018లో ఏకంగా రూ.17 వేల కోట్లను సేకరించింది.

దాటనున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం: అరుణ్ జైట్లీ


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం లక్ష్యానికి మించి నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గలు తెలిపాయి. ఈ సారి డిజిన్వెస్ట్‌మెంట్ రూ.80 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, దీనికి అదనంగా మరో రూ.5 వేల కోట్లు సేకరించే అవకాశం ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఐదో విడుత జారీ చేసిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లకు కొనుగోలుదారుల నుంచి వచ్చిన విశేష స్పందనతో ఇందుకు దోహదం చేయనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆర్‌ఈసీ-పీఎఫ్‌సీ ఒప్పందం ద్వారా మరో రూ.14,500 కోట్లు లభించాయి.

453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles