అమ్మకానికి ఎయిర్‌ ఇండియా!

Mon,October 21, 2019 12:54 AM

-వచ్చే నెలలో మరో దఫా బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. వచ్చే నెలలో మరో దఫా ప్రణాళికను ప్రకటించబోతున్నది. సంస్థలో తనకున్న 100 శాతం వాటా ను విక్రయించడానికి నవంబర్‌లో బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి చూపాయన్నారు. రూ.58 వేల కోట్ల స్థాయి రుణ సంక్షోభంలో ఉన్న సంస్థ..ప్రస్తుతం రోజువారి ఇంధనం కొనుగోలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లు కొన్ని విమానాశ్రయాల్లో ఇంధన సరఫరాను నిలిపివేశాయి కూడా. గతవారంలో పౌరవిమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా మాట్లాడుతూ..ఈ నెల 22న ఎయిర్‌ ఇండియా బోర్డు సమావేశమై, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు చెప్పారు. అంతకుముందు ఈ నెల మొదట్లో ఎయిర్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ కూడా ప్రైవేటీకరణకు సంబంధించి చర్చించింది. ఈ ప్రైవేటీకరణపై సంస్థ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగాలు పోతాయనే భయం వారిలో నెలకొన్నది. ప్రత్యేక పర్పస్‌ వెహికల్‌, ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(ఏఐఏహెచ్‌ఎల్‌)కి చెందిన బాండ్లను జారీ చేయడం ద్వారా సేకరించనున్న నిధుల్లో రూ.30 వేల కోట్లను ఎయిర్‌ ఇండియా అప్పు తీర్చడానికి ప్రత్యేక ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌), హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌సీఐ)లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ నిమిత్తం రుణాలు ఇవ్వడానికి ఏఐఏహెచ్‌ఎల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 16 నుంచి ఇప్పటి వరకు బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.21,985 కోట్ల నిధులను సేకరించింది.

479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles