ద్విచక్ర వాహన ఎగుమతుల్లో వృద్ధి

Mon,February 11, 2019 12:43 AM

Growth in two wheeler exports

-ఏప్రిల్-జనవరి మధ్యకాలంలో 19 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశవ్యాప్తంగా అమ్మకాలు భారీగా పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన తయారీ సంస్థలకు ఎగుమతుల రూపంలో భారీ ఊరట లభిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన పది నెలల్లో ఎగుమతుల్లో ఏకంగా 19.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఈ విషయం భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో భారత్ నుంచి విదేశాలకు 27,59,935 యూనిట్ల ద్విచక్ర వాహనాలు ఎగుమతి అయ్యాయి. క్రితం ఏడాది 23, 09,805 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా మోటర్ సైకిళ్లకు, స్కూటర్లకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టంచేసింది. దేశీయ విక్రయాల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమవగా, అదే ఎగుమతుల్లో మాత్రం రెండంకెల వృద్ధి నమోదైంది. ఏప్రిల్-జనవరి మధ్యకాలంలో 1,81,25,656 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 1,67,71,630 యూనిట్లతో పోలిస్తే 8.07 శాతం పెరుగుదల కనిపించింది.

నివేదికలో ముఖ్య అంశాలు...


-24,12,800 యూనిట్ల మోటర్ సైకిళ్లు ఎగుమతి అయ్యాయి. గతేడాది అయిన 20,34,250 యూనిట్లతో పోలిస్తే 18.61 శాతం పెరిగాయి.
-స్కూటర్ల ఎగుమతి ఏడాది ప్రాతిపదికన 26.67 శాతం ఎగబాకి 3,32,197లకు చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇది 2,62,253గా ఉన్నాయి.
-మోపెడ్స్ వాహనాల ఎగుమతిలో 12.3 శాతం పెరిగి 14,938గా ఉన్నాయి. గతేడాది 13,302.
-ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాలు రికవరీ బాట పట్టడం ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నెలకొన్నది.

1607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles