జీవీకే నష్టం రూ.159 కోట్లు

Fri,November 15, 2019 02:50 AM

హైదరాబాద్, నవంబర్ 14: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.159 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.110.6 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా పెరిగింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను కంపెనీ ఆదాయం రూ.1,060 కోట్ల నుంచి రూ.1,059 కోట్లకు పడిపోయింది. వీటిలో ఎయిర్‌పోర్ట్ విభాగం నుంచి రూ.904 కోట్ల ఆదాయం సమకూరగా, మిగతాది రోడ్లు, విద్యుత్ రంగాల నుంచి లభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

158
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles