హైదరాబాద్‌లో హాఫెల్ డిజైన్ సెంటర్

Fri,November 15, 2019 03:03 AM

హైదరాబాద్, నవంబర్ 14:జర్మనీకి చెందిన ప్రముఖ గృహోపకరణాలు, ఫర్నిచర్, కిచెన్ ఫిట్టింగ్ తయారీ సంస్థ హాఫెల్ రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది డిజైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా..తాజాగా పదో సెంటర్‌ను హైదరాబాద్‌లో గురువారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ జుర్గెన్ వోఫ్ మాట్లాడుతూ..ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లో ప్రవేశించడం సంతోషంగా ఉన్నదని, రూ.8 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో 11 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గడిచిన సంవత్సరంలో రూ.706 కోట్లుగా నమోదైన టర్నోవర్..వచ్చే నెల చివరినాటికి రూ.800 కోట్లు దాటవచ్చునని తెలిపారు.


వచ్చే రెండేండ్లలో రూ.1,000 కోట్లు దాటేదానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఈ డిజైన్ సెంటర్‌తోపాటు ఇతర మార్కెటింగ్ కలిపి మొత్తంగా 40 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి యూరప్ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయాలు జరుపుతున్నట్లు, భవిష్యత్తులో డిమాండ్ అధికంగా ఉంటే ఇక్కడే తయారీ యూనిట్‌ను నెలకొల్పే అవకాశం ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు.

277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles