150 స్టోర్లు..500 కోట్ల టర్నోవర్

Fri,April 19, 2019 12:59 AM

Happi Mobiles to open 200 new stores this fiscal

-భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న హ్యాప్పీ మొబైల్స్

హైదరాబాద్, ఏప్రిల్ 18: రాష్ర్టానికి చెందిన మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ విక్రయ దిగ్గజం హ్యాప్పీ మొబైల్స్ దూకుడును పెంచింది. వచ్చే మార్చినాటికి తెలుగు రాష్ర్టాల్లో మరో 100 నుంచి 150 వరకు కొత్తగా రిటైల్ అవుట్‌లెట్లను ప్రారంభించడంతోపాటు రూ.500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ పవన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో 46 రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.250 కోట్ల టర్నోవర్ సాధించింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిటైల్ అవుట్‌లెట్లను నూతనంగా డిజైన్ చేసినట్లు, ముఖ్యంగా లైవ్ డెమో జోన్లు, వర్చ్యూల్ రియల్టీ, లైఫ్‌ైస్టెల్ ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రిటైల్ అవుట్‌లెట్లలో మొబైళ్లతోపాటు యాక్సెస్ సిరీస్‌లు లభిస్తుండగా, భవిష్యత్తులో లైఫ్‌ైస్టెల్ ఉత్పత్తుల్లో ఎల్‌ఈడీ టీవీలు, వాక్యూమ్ క్లీనర్లు, సీసీటీవీలను సైతం లభించనున్నాయన్నారు. వ్యాపార విస్తరణ పూర్తయితే మొత్తం సిబ్బంది సంఖ్య వెయ్యికి పైకి చేరుకోనున్నారు. ప్రస్తుతం సంస్థలో 500 మంది విధులు నిర్వహిస్తున్నారు.

వార్షికోత్సవ ఆఫర్లు

సంస్థను ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేసిన వాటిపై 5 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం పొదుపు, ఎంపిక చేసిన మోడళ్ల ధరల తగ్గింపు, స్క్రీన్ రీప్లెస్‌మెంట్, రెండేండ్ల వ్యారెంటీ, ఎక్సేంజ్ ఆఫర్, రూపాయి చెల్లించి ఈఎంఐ సదుపాయం ఎంచుకునే అవకాశం, 64జీబీ సామర్థ్యం కలిగిన ఐఫోన్ ఎక్స్‌ఆర్ మొబైల్‌ను రూ.50,999కే అందిస్తున్నది. వీటితోపాటు ఎంపిక చేసిన మొబైళ్లను కొనుగోలు చేసిన వారికి మైక్రోమాక్స్ ఎల్‌ఈడీ టీవీ, క్రాంప్టన్ కూలర్స్, ఐబాల్ బారెల్, మహారాజ మిక్సర్, హెడ్ ఫోన్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.

1743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles