భారీగా పెరిగిన ఫారెక్స్ రిజర్వులు

Sat,March 23, 2019 01:05 AM

Heavily Raised Forex Reserves

ముంబై, మార్చి 22: ఫారెక్స్ రిజర్వులు భారీగా పెరిగాయి. మార్చి 15తో ముగిసిన వారంలో విదేశీ మారకం రిజర్వులు 3.602 బిలియన్ డాలర్లు పెరిగి 405.638 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అంతక్రితం వారంలో 258.8 మిలియన్ డాలర్లు పెరిగి 402.035 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటిలో ఫారిన్ కరెన్సీ రూపంలోవున్న ఆస్తులు విలువ 3.546 బిలియన్ డాలర్లు ఎగబాకి 377.773 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే పసిడి రిజర్వులు 38.9 మిలియన్ డాలర్లు అధికమై 23.408 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 13, 2018న రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.

400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles