చిక్కిన మరో ఆర్థిక నేరగాడు

Sat,March 23, 2019 01:25 AM

Hitesh Patel detained in Albania

-హితేష్ పటేల్‌ను అల్బేనియాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
-రూ.8,100 కోట్ల స్టెరిలైట్ మోసం కేసులో కీలక సూత్రదారి

న్యూఢిల్లీ, మార్చి 22: దేశీయ బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టి దొంగచాటున విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కోక్కరు చిక్కుతున్నారు. మొన్నటికి మొన్న విజయ్ మాల్యా, నిన్న నీరవ్ మోదీలు ఇప్పటికే పోలీసులకు చిక్కగా..తాజాగా మరో ఆర్థిక నేరగాడు అరెస్ట్ అయ్యారు. రూ.8,100 కోట్ల మోసం కేసులో గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూపు ప్రమోటర్లలో ఒకరైన హితేష్ పటేల్‌ను అల్బేనియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వ్యతిరేకంగా ఈ నెల 11న ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అక్కడి పో లీసులు ఆ దేశ రాజధాని టిరానాలో ఈ నెల 20న అదుపులోకి తీసుకొన్నారు. పటేల్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని అక్కడి ప్రభుత్వ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో ఆయనను భారత్‌కు రప్పించడానికి ఈడీ, సీబీఐ వర్గాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. త్వరలో ఈ విచారణ ఏజెన్సీలకు సంబంధించిన ఉన్నతాధికారులు అల్బేనియాకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూపు నిర్వహకులైన నితిన్ జయంతిలాల్ సందేసరా, చేతన్ కుమార్ జయంతిలాల్ సందేసరా, చేతన్ భార్య దీప్తి, హితేష్ పటేల్‌లు తప్పుడు ప త్రాలు చూపించి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నారు. వీటిని విదేశాలకు అక్రమంగా తరలించినట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు ఇప్పటికే దేశం విడిచి పారిపోయా రు. దీంతో వీరిని పరారిలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. ఈ క్రమంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించగా, వీరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ కేసులోప్రధాన నిందితులైన సందేసరా బ్రదర్స్, దీప్తి చేతన్ సందేసరా, రాజ్‌భూషణ్ ఓంప్రకాశ్ దీక్షిత్, విలాస్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాతి, ఆంధ్రాబ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ గార్గ్‌లతోపాటు ఇతరులపై ఈడీ, సీబీఐలు పలు కేసులను దాఖలు చేశాయి. వీరిలో నితిన్, చేతన్‌లపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అ యింది కూడా. వీరిద్దరికి అల్బేనియా పౌరస త్వం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే వీరి ఆ చూకీపై ఇంతరకు ఎలాంటి సమాచారం లేదు.

మోసపూరిత కంపెనీలెన్నో..


స్టెరిలైట్ బయోటెక్ గ్రూపు ప్రమోటర్లు దొంగ కంపెనీలను సృష్టించడంలో దిట్ట. వీటిద్వారా పలు బ్యాంకుల వద్ద భారీగా రుణాలు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇలా సేకరించిన నిధులను అక్రమంగా విదేశాలకు తరలించడంలో పటేల్ కీలకపాత్ర పోషించారు. వీటితో అక్కడ పలు ఆస్తులు, విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడానికి ఈ నిధులను వినియోగించారు. గతంలో ప్రమోటర్లతోపాటు పటేల్‌పై కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఆంధ్రాబ్యాంక్ వాటా రూ.5 వేల కోట్ల


హైదరాబాద్ కేంద్రస్థానంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఆంధ్రాబ్యాంక్‌కు భారీ నష్టం వాటిళ్లింది. స్టెరిలైట్ బయోటెక్ ప్రమోటర్లకు ఆంధ్రాబ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రూ.5 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇవి నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయి. వడ్డీతో కలుపుకొని ప్రస్తుతం ఇవి రూ.8,100 కోట్లకు చేరుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదు చార్జిషీట్లను దాఖుల చేసిన ఈడీ.. రూ.4,710 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసింది.

3136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles