బీఎస్-6 ప్రమాణాలతో యాక్టివా

Thu,September 12, 2019 04:05 AM

Honda Activa 125 BS6 Launched In India Prices Start At rs 67,490

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్.. బీఎస్-6 ప్రమాణాలకు తగ్గట్టుగా తయారుచేసిన యాక్టివా స్కూటర్‌ను మళ్లీ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. మూడు రకాల్లో లభించనున్న ఈ యాక్టివా 125 స్కూటర్ ధరను రూ.67,490గా నిర్ణయించింది. నూతన కాలుష్యా మార్గదర్శకాలకు లోబడి తయారు చేసిన ఈ స్కూటర్‌లో పలు మార్పులు చేసినట్లు, ముఖ్యంగా ఎల్‌ఈడీ లైటింగ్ వంటివి ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల వాహనాలు భారత్ స్టేజ్-6 ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆర్థిక మంత్రి కోర్టులో జీఎస్టీ తగ్గింపు బాల్

వాహనాలపై విధిస్తున్న జీఎస్టీ రేటు తగ్గింపు విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎస్టీ కౌన్సిల్ చేతిలో ఉన్నదని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. త్వరలో వాహన నిషేధం పాలసీని ప్రకటించనున్నట్లు ప్రకటించిన మంత్రి..వీటిలో కాలంతీరిన ద్వి, త్రి, నాలుగు చక్రాల వాహనాలు కూడా ఉండనున్నాయని మంత్రి సంకేతాలిచ్చారు.

581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles